ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 10:45 pm Posted by : Shiva Kumar BS

పిల్లలతో కూర్చొని భోజనం చేసిన కలెక్టర్లు

విద్య, మధ్యాహ్న భోజనం, పాఠశాల సౌకర్యాలపై విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చట

ఆదాబ్ సైబరాబాద్: ప్రజలతో మమేకమయ్యే పాలనకు నిదర్శనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా కె. అగర్వాల్, నారాయణపేట జిల్లా కలెక్టర్ చె. ప్రియాంక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా కలెక్టర్లు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి చదువు, పాఠశాలలో అందుతున్న విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

పిల్లలతో ఎలాంటి అధికారిక హంగులు లేకుండా స్నేహపూర్వకంగా మమేకమైన కలెక్టర్ల తీరు విద్యార్థులను ఆకట్టుకుంది. ప్రభుత్వం ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన సంరక్షణ అందించేందుకు కట్టుబడి ఉందనే సందేశాన్ని వారి చర్య ప్రతిబింబించింది.ఈ ఆత్మీయ సమావేశం విద్యార్థులకు చిరస్మరణీయ అనుభూతిని కలిగించడమే కాకుండా, ప్రజల అవసరాలకు స్పందించే మానవీయ పరిపాలనకు నిదర్శనంగా నిలిచింది.