ట్రాఫిక్ పోలీసుల సంక్షేమే ధ్యేయంగా ఉచిత వైద్య శిబిరాలు

డీసీపీ రాహుల్ రెడ్డి ఐపీఎస్ చొరవతో జవహర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెల్త్ క్యాంప్ కీసర : ఎండ, వర్షం అనక ట్రాఫిక్‌తో నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మల్కాజ్‌గిరి కమిషనరేట్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డీసీపీ (ట్రాఫిక్, జోన్-1) రాహుల్ రెడ్డి చొరవతో, 'రెటినోవా ఫౌండేషన్' ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్, ఐ ప్లానెట్ ఆప్టిక్స్, పద్మ సాయి డెంటల్, స్కై ఫీట్ ఫిజియోథెరపీల సహకారంతో కమిషనరేట్ పరిధిలోని 11 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఉచిత ఆరోగ్య...