రూ.13 కోట్ల బీటీ రహదారికి శంకుస్థాపన

ఎల్కతుర్తి అభివృద్ధిలో ముందంజ.. గ్రామాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని వెల్లడి ఆదాబ్ సైబరాబాద్, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఎల్కతుర్తి జంక్షన్ నుంచి మడిపల్లి–ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,...