సైబర్ నేర బాధితులకు మెగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ డ్రైవ్
126 మంది బాధితులకు రూ.27.38 లక్షల నిధుల రికవర్.. 23 ఖాతా ఫిర్యాదుల పరిష్కారం ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: సైబర్ నేరాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన మెగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ (GRM), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM) ద్వారా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ఈ మెగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ డ్రైవ్లో సైబర్ నేరాల కారణంగా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, డీ-ఫ్రీజ్ చేయడం, లియెన్ తొలగింపు...