ఆషాఢ బోనాల ఉత్సవాలకు పటిష్ట భద్రతా

భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే బోనాల మహోత్సవాలను భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కేంద్రం నుంచి గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ...