ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:21 pm Posted by : Shiva Kumar BS

కాంగ్రెస్ హామీల మోసాలపై పోరాటానికి సిద్ధం

బీఆర్ఎస్ నేతల పిలుపు

పేటబషీరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ, ఆ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టనున్న ఉద్యమాల్లో యువత పెద్దఎత్తున పాల్గొనాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జూలై 18న సనత్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సదస్సు’ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పేటబషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ నాయకత్వం వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో జూలై 18న సనత్‌నగర్ స్టేడియంలో జరిగే *’యువ సంగ్రామ సదస్సు’*లో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జీడిమెట్ల 132 డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు సంపత్ మాధవరెడ్డి, వీరారెడ్డి నరేందర్ రెడ్డి, ఎల్ల గౌడ్, వీరంశెట్టి, రమణారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.