కాంగ్రెస్ హామీల మోసాలపై పోరాటానికి సిద్ధం
బీఆర్ఎస్ నేతల పిలుపు పేటబషీరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం 'యూత్ డిక్లరేషన్' పేరుతో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ, ఆ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టనున్న ఉద్యమాల్లో యువత పెద్దఎత్తున పాల్గొనాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జూలై 18న సనత్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న 'యువ సంగ్రామ సదస్సు' బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పేటబషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు,...