గంజాయి అక్రమ రవాణా..యువకుడు అరెస్ట్
స్నేహితుడి సహకారంతో దందా ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్ : ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశాకు చెందిన అలోక్ సర్దార్ (20) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు తన...