చలో సెక్రటేరియట్ ముట్టడిలో ఉద్రిక్తత
ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ అరెస్ట్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ సర్టిఫికెట్ల కోసం ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి మండిపాటు ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన 'చలో సెక్రటేరియట్' కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం...