ఖమ్మం ఎం.పీ రామసహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో 300 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఖమ్మం :ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్సలు పొందిన పేదల పక్షాన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసాగా నిలుస్తోందని కాంగ్రెస్ జిల్లా నాయకులు కొనియాడారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దీపక్ చౌదరి, తదితరులు హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 300 మంది లబ్ధిదారులకు రూ. 88,78,600 మేరకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి విశేష కృషి జరుగుతోందని అన్నారు. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, ఎంతో శ్రద్ధ చూపి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఆరోగ్య లబ్ధి చేకూరేలాగా ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
లబ్ధిదారులకు భోజన సదుపాయం
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పొందేందుకు వచ్చిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి కల్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేబోయిన నర్సింహారావు, నాయకులు కొప్పుల చంద్రశేఖర్, టీఎసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, సత్యనారాయణ రెడ్డి, నాయకులు కోసూరి శ్రీను, మల్లెల నాగేశ్వరరావు, ఓబీసీ రాష్ట్ర నేత హారికా నాయుడు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కొర్లపాటి అన్నపూర్ణ, శ్రీ కళా రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ అనుబంధ నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.