ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ రద్దు కుట్రను విరమించుకోవాలి
బీసీ సంఘాల డిమాండ్ కూకట్‌పల్లి : ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను రద్దు చేసే ప్రభుత్వ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు. ఈ డిమాండ్లతో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ...