బోనాల ఉత్సవాలకు ఘన సన్నాహక సమావేశం
సాయిబాబా కాలనీ అభివృద్ధే లక్ష్యం ఐక్యతతో ముందుకు సాగుదాం అధ్యక్షుడు జె. శ్రీనివాసులు ఆదాబ్ సైబరాబాద్, షాద్‌నగర్ : షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలో బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా 6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ హాజరుకాగా, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి కాలనీ అభివృద్ధి కమిటీ నూతన...