మొబైల్ టవర్ పరికరాల చోరీ ముఠా అరెస్ట్

రూ.70 లక్షల విలువైన ఆర్‌ఆర్‌యూల స్వాధీనం న్యూఢిల్లీ : మొబైల్ టవర్లలో వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ కోసం ఉపయోగించే కీలకమైన రిమోట్ రేడియో యూనిట్ పరికరాలను చోరీ చేసి విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఛేదించింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు చోరీ చేసిన ఆర్‌ఆర్‌యూ పరికరాలను నకిలీ పత్రాల సహాయంతో హాంకాంగ్‌కు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. సాంకేతిక నిఘా, సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులను అదుపులోకి...