రహదారులు, పార్కులను కాపాడండి..
హైడ్రా ప్రజావాణికి 56 ఫిర్యాదులు హైదరాబాద్ : లేఅవుట్లలో రహదారులు, పార్కులు, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ప్రజా ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 56 ఫిర్యాదులు అందాయి. అందిన వినతులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, సంబంధిత అధికారులకు చర్యల కోసం పంపించారు. ఫిర్యాదుల్లో భాగంగా కుత్బుల్లాపూర్ సర్వే నంబర్ 148లో నాలాపై సుమారు 23 గుంటల భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించారని ప్రజా బాధ్యతలు హక్కుల చైతన్య వేదిక ప్రతినిధులు...