HMDA చీఫ్ ఇంజినీర్ బి.రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసును ACB నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొండకల్, కిష్టాపూర్, పసుమాములలో ఐదు ప్లాట్లు, నార్సింగి, నానక్‌రామ్‌గూడలో నాలుగు ఫ్లాట్లు, గుడూర్‌లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో విల్లా, కొండాపూర్‌లో జీ+4 భవనం గుర్తించారు.