ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 9:15 pm Posted by : Shiva Kumar BS

ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన ఖమ్మం త్రివేణి హౌస్ ఎలక్షన్స్-2026

ఖమ్మం : నగరంలోని త్రివేణి పాఠశాలలో ఈరోజు హౌస్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, ఈ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియను పోలి ఉండడం మూలంగా విద్యార్థిని -విద్యార్థులు ఎన్నికల ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పాఠశాలలోని విద్యార్థులను నాలుగు రంగుల పేర్లతో అనగా ఛత్రపతి శివాజీ -బ్లూ హౌస్, రాజరాజ నరేంద్ర -గ్రీన్ హౌస్, శ్రీకృష్ణదేవరాయ-రెడ్ హౌస్, గణపతి దేవ-ఎల్లో హౌస్ లాగా విభజిస్తారని, ఆయా హౌస్లలో ఉన్న విద్యార్థిని -విద్యార్థులు వారి హౌస్ లకు సంబంధించి లీడర్స్,కో – లీడర్స్, ట్రెజరర్ మొదలైన బాధ్యతలను నిర్వర్తించడానికి తమ తోటి విద్యార్థుల నుండి ఎంపిక చేసుకుంటారు.

ఈ ఎంపిక ప్రక్రియ మాక్ పోలింగ్ లాగా నిర్వహిస్తామని ఇందులో ఆయా బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు వచ్చిన విద్యార్థినీ-విద్యార్థుల చేత ముందుగా నామినేషన్ ప్రక్రియ, ఆ తర్వాత ఎన్నికల గుర్తు కేటాయింపు, ఆపైన ప్రచారం పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఎన్నిక రాజ్యాంగబద్ధంగా స్థానిక, మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతుందో, అదే విధంగా జరిపి విద్యార్థుల్లో అవగాహన తీసుకొస్తామని అన్నారు. ఎన్నికైన విద్యార్థులు తమ తమ బాధ్యతల్లో సంవత్సరమంతా కొనసాగుతారని,మరుసటి సంవత్సరానికి మరల ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న ,ముస్తఫా , క్యాంపస్ ఇంచార్జ్ విక్టర్ చార్లెస్, ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ సందీప్ ఉపాధ్యాయినీ- ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ -విద్యార్థులు పాల్గొన్నారు.