హెచ్‌ఎస్‌బీసీలో ‘Coffee With Cop’.. సైబర్ భద్రతపై అవగాహన

హైదరాబాద్‌లోని హెచ్‌ఎస్‌బీసీ క్యాంపస్‌లో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్  సంయుక్తంగా ఐదో విడత ‘కాఫీ విత్ ఎ కాప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. “డిజిటల్ డిలెమాస్: లెట్స్ నావిగేట్ ఇట్ టుగెదర్” అంశంపై జరిగిన సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ కె. పుష్ప, ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్ ఉద్యోగులకు సైబర్ మోసాల నివారణ, సురక్షిత డిజిటల్ అలవాట్లపై అవగాహన కల్పించారు. “Pause. Verify. Protect.” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.