సైబర్ భద్రతపై ప్రత్యేక డ్రైవ్..’కాఫీ విత్ ఎ కాప్’ కార్యక్రమం
హెచ్‌ఎస్‌బీసీ హైదరాబాద్ క్యాంపస్‌లో సైబరాబాద్ పోలీసుల సమావేశం ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఎస్‌బీసీ హైదరాబాద్ క్యాంపస్‌లో 'కాఫీ విత్ ఎ కాప్' కార్యక్రమం ఐదో విడత విజయవంతంగా నిర్వహించారు. "డిజిటల్ డిలెమాస్: లెట్స్ నావిగేట్ ఇట్ టుగెదర్" అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌బీసీ ఉద్యోగులు సైబర్ భద్రత, డిజిటల్ మోసాల నివారణ, బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ వినియోగంపై అవగాహన పొందారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ కె. పుష్ప, ఇన్‌స్పెక్టర్...