21 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు..

నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రియాంక అలా హైదరాబాద్ : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన అర్హులైన 21 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేసే దృక్పథంతో విధులు నిర్వహించాలని నూతన ఉద్యోగులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు ఉంటాయని...