జూలై 20న క్యూర్‌లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు శ్రీకారం.. లక్ష ఇళ్ల నిర్మాణం

HYDERABAD: క్యూర్ పరిధిలో ఈ నెల 20న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దశలవారీగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందన్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1,000 వరకు ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోని ప్రభుత్వ భూముల్లోనే ఇళ్లు నిర్మించి యాజమాన్య హక్కులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.