శ్మశానవాటిక అభివృద్ధి పనుల బిల్లులకు సైతం లంచం
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పెద్దపల్లి : పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, టెనుగువాడ హిందూ శ్మశానవాటిక, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.12,28,748 విలువైన తుది బిల్లును ప్రాసెస్ చేసి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC)కు పంపించేందుకు అధికారిక అనుకూలం కల్పిస్తానంటూ కాంట్రాక్టర్...