హైడ్రోజన్ రైళ్లలో ప్రపంచానికి భారత్ ఆదర్శం
జింద్–సోనిపట్ ప్రాజెక్టుతో గ్రీన్ రైల్వే దిశగా కీలక అడుగు న్యూఢిల్లీ: హైడ్రోజన్ ఆధారిత రైళ్ల అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు వేసింది. జింద్–సోనిపట్ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టుతో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోలింగ్ స్టాక్, హైడ్రోజన్ నిల్వ, పంపిణీ, భద్రతా వ్యవస్థలు, నిర్వహణ విధానాలతో కూడిన సమగ్ర హైడ్రోజన్ రైల్వే ఎకోసిస్టమ్‌ను భారతీయ రైల్వే అభివృద్ధి చేసింది. రైలులో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను అమలు చేశారు. హైడ్రోజన్ లీకేజీ గుర్తింపు వ్యవస్థ, ఆటోమేటిక్ షట్‌డౌన్, మంటలను నియంత్రించే సాంకేతికత,...