ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 10:31 am Posted by : Shiva Kumar BS

సైబరాబాద్ కమిషనరేట్‌లో భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

హైదరాబాద్, జూలై 16: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలనా అవసరాల దృష్ట్యా 55 మంది సివిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జూలై 16న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం పలు పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHO), డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు (DI), ప్రత్యేక విభాగాల అధికారులను కొత్త స్థానాలకు నియమించారు.

బదిలీల్లో భాగంగా కూకట్‌పల్లి SHOగా పనిచేస్తున్న కే.వి. సుబ్బారావును మాదాపూర్ SHOగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న డి. స్వామి గౌడ్ను కూకట్‌పల్లి SHOగా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మియాపూర్ SHO జి. ప్రశాంత్ను బాలానగర్ SHOగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఎన్. జయరామ్ను మియాపూర్ SHOగా నియమించారు. అలాగే సైబర్ క్రైమ్స్ విభాగంలో పనిచేస్తున్న జి. విజయ్ కుమార్ను కేపీహెచ్‌బీ SHOగా, ఆలాపూర్ SHO వెంకట్ రెడ్డిని కొల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ SHOగా బదిలీ చేశారు.

Oplus_16908288

అదేవిధంగా గచ్చిబౌలి, నర్సింగి, చందానగర్, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట, మేడ్చల్, దుండిగల్, సూరారం, జీడిమెట్ల, బాచుపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో కూడా ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లు కల్పించారు. సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW), SOT, CCRB, IT సెల్, మహిళా & శిశు భద్రత విభాగాలు, CTC వంటి ప్రత్యేక విభాగాల్లోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేసి, సంబంధిత అధికారులు విధుల నుంచి రిలీవ్ అయిన తేదీలు, కొత్త పోస్టింగ్‌లో చేరిన వివరాలను తక్షణమే కమిషనరేట్ కార్యాలయానికి తెలియజేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని డీసీపీలకు ఆదేశించారు.