సైబరాబాద్ కమిషనరేట్‌లో భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

హైదరాబాద్, జూలై 16: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలనా అవసరాల దృష్ట్యా 55 మంది సివిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జూలై 16న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం పలు పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHO), డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు (DI), ప్రత్యేక విభాగాల అధికారులను కొత్త స్థానాలకు నియమించారు. బదిలీల్లో భాగంగా కూకట్‌పల్లి SHOగా పనిచేస్తున్న కే.వి. సుబ్బారావును మాదాపూర్ SHOగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న డి. స్వామి గౌడ్ను కూకట్‌పల్లి...