ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 10:39 am Posted by : Shiva Kumar BS

సైబరాబాద్ కమిషనరేట్‌లో 55 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలనా అవసరాల దృష్ట్యా 55 మంది సివిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, చందానగర్, జీడిమెట్ల, మేడ్చల్, దుండిగల్, బాచుపల్లి,సురారం తదితర పోలీస్ స్టేషన్లతో పాటు సైబర్ క్రైమ్స్, ఎస్‌వోటీ, ఈవో‌డబ్ల్యూ, ఐటీ సెల్ వంటి ప్రత్యేక విభాగాల్లోనూ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. సంబంధిత అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.