ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు
శేరిలింగంపల్లి జూలై 21: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాసేవ పట్ల అంకితభావం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు...