రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ ఆందోళన.. కేంద్ర ప్రభుత్వంపై కూన శ్రీశైలం గౌడ్ విమర్శలు

ఢిల్లీలో ప్రధానమంత్రి నివాస ముట్టడి సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్‌లో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ నుంచి కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర...