తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వరంగల్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్ ఎన్ఐటీ గెస్ట్ హౌస్‌లో ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సంక్షేమం, వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరయ్యారు.