ఆల్విన్ కాలనీ 124వ డివిజన్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ.. రాహుల్ గాంధీకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శంషిగూడా చౌరస్తా నుంచి గుడ్ విల్ హోటల్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థులపై దాడులు, అరెస్టులు, ప్రతిపక్ష నాయకులపై చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి...