ఎల్లమ్మబండలో మంచినీటి కష్టాలు.. ప్రజల ఆగ్రహం!

మోటార్లు పెడితేనే నల్లాల్లో నీరు.. తారకరామా నగర్‌లో తీవ్ర ఇబ్బందులు శేరిలింగంపల్లి : కూకట్‌పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో మంచినీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. పేరుకే రిజర్వాయర్ ఉన్నప్పటికీ స్థానికులకు చుక్క నీరు కూడా సక్రమంగా అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్లు ఏర్పాటు చేసుకుంటే తప్ప నల్లాల్లో నీరు రాని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తారకరామా నగర్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఎల్లమ్మబండ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రతిరోజూ వేల లీటర్ల...