ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఆశంగారి సురేష్ నియామకం
హైదరాబాద్, జూలై 26: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఆశంగారి సురేష్‌ను నియమిస్తూ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు చిన్న గాలోల్ల రాజు నియామక లేఖను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆశంగారి సురేష్ మాట్లాడుతూ తనకు ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ డివిజన్‌లోని దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.డివిజన్‌లోని ఎస్సీ వర్గాలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి...