ఢిల్లీ విద్యార్థులపై దాడులను ఖండిస్తూ శేరిలింగంపల్లిలో టీఆర్‌పీ నిరసన ర్యాలీ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శేరిలింగంపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నరసయ్య గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమంలో టీఆర్‌పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా...