పచ్చని కూకట్‌పల్లి లక్ష్యంగా మొక్కల పంపిణీ – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బండి రమేష్ పిలుపు

కూకట్‌పల్లి: హైదరాబాద్‌ను హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్ పిలుపునిచ్చారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వసంతనగర్ డివిజన్ గోపాలనగర్ కాలనీ పార్కులో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శ్రీ రోహిత్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ చక్రపాణి సహకారంతో, మందలపు రోజారమణి ట్రస్ట్ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకుడు శ్రీ సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో...