ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 11:54 am Posted by : N Sandeep

హైటెక్స్‌లో టీవీ9 ‘స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో’ ప్రారంభం.. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీవీ9 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో” కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురాం రెడ్డి, తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప కల అని పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేసుకునే దిశగా కొనుగోలుదారులకు వినూత్నమైన, పారదర్శకమైన రియల్ ఎస్టేట్ ఎంపికలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడంలో టీవీ9 నిర్వహిస్తున్న ‘స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో’ అభినందనీయమని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారులకు విశ్వసనీయ సమాచారం, మెరుగైన అవకాశాలు కల్పించే ఇటువంటి ప్రదర్శనలు మరింత ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి అభిప్రాయపడ్డారు.