కీసర సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఆదాబ్ సైబరాబాద్, మేడ్చల్ : కీసర సర్కిల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం టీపీఎస్ మేఘన ఆధ్వర్యంలో యాప్రాల్, షామీర్‌పేట్, దేవరయాంజల్, కీసర వార్డుల్లో జేసీబీల సహాయంతో పలు అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి. రామలింగం మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు...