నకిలీ పత్రాలతో రూ.4.11 కోట్ల గృహ రుణాల మోసం..8 మంది అరెస్ట్
ఆదాబ్ సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, : నకిలీ స్థిరాస్తి పత్రాలను సృష్టించి వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి రూ.4.11 కోట్ల విలువైన గృహ రుణాలు పొందిన మోసాన్ని కీసర పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి నకిలీ ఆస్తి పత్రాలు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు రికార్డులు తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను నమ్మబలికి భారీ మొత్తంలో...