ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బౌరంపేట్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “నాజ్ – ది ఎలైట్ కార్ స్టూడియో” షాపును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా షాప్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, సంస్థ మరింత అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రగతి నగర్‌లోని నాన్ కన్వెన్షన్‌లో ఆర్.కే. ట్రావెల్స్ అధినేత చంద్రమౌళి గారి 75వ జన్మదిన వేడుకల్లో పాల్గొని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.