ఇందిరా రెడ్డి నగర్‌లో భారీ కార్డన్ సెర్చ్.. 52 బైక్‌లు, 5 ఆటోలు సీజ్
ఆదాబ్ సైబరాబాద్, శంకర్ పల్లి :- రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధి లోని మొకిలా పోలీస్ స్టేషన్ ప్రాంతం లో ఇందిరా రెడ్డి నగర్ ఫేజ్-2 ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఏసీపీ కిషన్ ఆధ్వర్యంలో మొకిలా పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానిత వ్యక్తులు మరియు అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని ఇళ్లు, వీధులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో సరైన...