ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:21 pm Posted by : Shiva Kumar BS

నర్సప్పగూడ కురుమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

కురుమ సంఘం నూతన అధ్యక్షులుగా కట్న శ్రీనివాస్

యూత్ అధ్యక్షులు గా జంగిలి శ్రీశైలం

ఆదాబ్ సైబరాబాద్, షాద్ నగర్ : నర్సప్పగూడ కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని గ్రామ కుల పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా కట్న శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా జెల్ల శంకరయ్య, ఉపాధ్యక్షుడిగా జంగిలి సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా గోవిందు యోగేష్, కోశాధికారిగా అల్లి గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా కురుమ యూత్ సంఘం అధ్యక్షుడిగా జంగిలి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా చెట్టుపల్లి శివ, ప్రధాన కార్యదర్శిగా కట్న రమేష్, కోశాధికారిగా బంగారు రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల పెద్దలకు, సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కురుమ సంఘం అభివృద్ధి, సమాజ ఐక్యత, యువత సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, జెల్ల శంకరయ్య జంగిలి కుమార్ గోవిందు శేఖర్ మాజీ ఉప సర్పంచ్
కట్న శేఖర్ ఆలూరి సాయిలు జంగిలి నరసింహ ఎత్తిన బీరప్ప అల్లి గోపాల్ గోవిందు ఆంజనేలు గోవిందు రాజు జంగిలి యాదయ్య జంగిలి మల్లయ్య కట్న బాలరాజు జంగిలి శేఖర్ జంగిలి మల్లేష్ కట్న షమానిల.సంఘ సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.