డ్రైనేజీ మూతలు లేక ప్రజలకు ప్రాణభయం..
నాసిరకం పనులపై కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆదాబ్ సైబరాబాద్, నిజాంపేట్: నిజాంపేట్ సర్కిల్ పరిధిలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఆరోపించారు. నాసిరకం రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప నుంచి డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి వెళ్లే మార్గంలో డ్రైనేజీపై మూతలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ సీపీఐ ఆధ్వర్యంలో...