గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల అపర్ణ సైబర్ కమ్యూన్ గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం వీక్షణలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా దేశ ప్రజల్లో దేశభక్తి, సేవా తత్పరత, అభివృద్ధి పట్ల బాధ్యతను మరింత బలోపేతం చేసే సందేశాలను అందించారని అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించడం వారి త్యాగాన్ని చిరస్మరణీయంగా నిలిపిందని పేర్కొన్నారు.దేశ యువత ఆవిష్కరణలు, శాస్త్ర–సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న విజయాలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువతే ప్రధాన శక్తి అని మరోసారి స్పష్టం చేశారని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ సాంకేతికత, పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించడం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.సమాజ సేవ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంతోనే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ప్రధాని చేసిన పిలుపును స్వాగతిస్తున్నామని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ, దేశ ప్రయోజనాలను సర్వోన్నతంగా భావించాలని మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు హనుమంత్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు విజయేందర్ సింగ్, డివిజన్ అధ్యక్షుడు శివా సింగ్, సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మహేష్, నాయకులు వెంకటస్వామి రెడ్డి, రాయల్, కిషన్ గౌలి, ప్రవీణ్, నాయకురాళ్లు వరలక్ష్మి, వినీత సింగ్, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.