మేడ్చల్–మల్కాజ్గిరి (అర్బన్) జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నూతన పదాధికారులను రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు ఘనంగా సన్మానించారు. జిల్లా ఓబీసీ మోర్చా పదాధికారులుగా ఇటీవల నియమితులైన నాయకులు ఆయనను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా నూతన పదాధికారులు అత్కరి మల్లేష్, సతీష్ గౌడ్, పండుగ రేణుక, తేజస్విని, శ్రవణ్ కుమార్, దిలీప్‌లను శాలువాలతో సత్కరించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి, వారి సేవాభావానికి తగిన గుర్తింపు, బాధ్యతలు అప్పగిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీల సంక్షేమం, సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శేఖర్ యాదవ్ నాయకత్వంలో బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.