సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం.. జవాన్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఆర్పీఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అచంచల ధైర్యసాహసాలు, విధి నిర్వహణలో అంకితభావంతో సీఆర్పీఎఫ్ దేశానికి విశిష్ట సేవలు అందిస్తోందని ప్రశంసించారు. అంతర్గత భద్రత పరిరక్షణ నుంచి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించడం వరకు ప్రతి సందర్భంలోనూ సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ ప్రయోజనాలనే ముందుంచారని ప్రధాని పేర్కొన్నారు. మావోయిజం నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పోషించిన పాత్ర విశేషమని, వారి కృషి వల్ల అనేక ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధికి మార్గం...