ఎన్‌టీఆర్ జంక్షన్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
200 ఐఎస్ఐ హెల్మెట్ల పంపిణీ హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ జోన్ ఏసీపీ కె. హరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ జంక్షన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తారక్ ట్రస్ట్ సహకారంతో ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే ప్రయాణికులకు 200 ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్లను పంపిణీ చేశారు. అలాగే వాహనదారులకు రాంగ్‌సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం, మైనర్లతో వాహనాలు నడిపించడం వంటి ప్రమాదకర...