షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆరంభం

చౌరస్తాలో కూల్చివేతలు షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. షాద్‌నగర్ ప్రధాన చౌరస్తా విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణ సీఐ సీతారాంతో పాటు పలువురు ఎస్‌ఐలు, భారీగా పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో చౌరస్తా వద్దకు చేరుకున్నారు. రోడ్డు విస్తరణకు సహకరిస్తూ కొందరు వ్యాపారులు, స్థానికులు...