Date of Publish : 27 July 2026, 8:01 pmPosted by : Shiva Kumar BS
జర్నలిస్టుల హక్కుల కోసం తెలంగాణ నుంచి ఢిల్లీలో గళమెత్తిన టీడబ్ల్యూజేఎఫ్
జంతర్ మంతర్ ధర్నాకు జాతీయ మీడియా విస్తృత కవరేజ్.
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ ముందుకు రావడం అభినందనీయం. జాతీయ మీడియా ప్రతినిధులుఖమ్మం/న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు విశేష స్పందన లభించింది. ఈ నిరసన కార్యక్రమాన్ని పలు జాతీయ మీడియా సంస్థలు విస్తృతంగా కవర్ చేయడం విశేషం. తెలంగాణ నుంచి జర్నలిస్టుల హక్కుల కోసం జాతీయ రాజధానిలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం అభినందనీయమని పలువురు జాతీయ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుండి పోరాటం చేయడం గొప్ప విషయమని వారు అభిప్రాయపడ్డారు. ధర్నా కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన
పలు కీలక డిమాండ్ల 2019లో కరోనా సమయంలో జర్నలిస్టులకు రైల్వే పాసు రాయితీ సదుపాయాన్ని ఉపసంహరించడం జరిగింది.
జాతీయస్థాయిలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, దాని ద్వారా అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఉచిత హెల్త్ కార్డ్స్ ఇళ్ల స్థలాలు పిల్లలకు విద్య వైద్యం ఉచితంగా అందించాలని, వారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు కూడా టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పాత్రికేయుని హక్కుల కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. జాతీయ మీడియా విస్తృత కవరేజ్ తో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కు దక్కిన గుర్తింపుగా పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్, కోశాధికారి వేములకొండ రమేష్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎలుగోటి వెంకట్, జిల్లా సభ్యులు, మామిడాల కిరణ్, కప్పల మధు,గుజ్జు గోపాలకృష్ణ, వెలిశెట్టి రామకృష్ణ బాబు, తదితరులు పాల్గొన్నారు.