తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు.. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని బీజేపీ డిమాండ్.
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ – ప్రేమ్ నగర్ బి బ్లాక్ మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో నూతన నాలా పైప్‌లైన్ పనుల సందర్భంగా భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగిన ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రేమ్ నగర్ బి బ్లాక్‌కు చెందిన బాలయ్య (70) అనే వృద్ధుడు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన నేపథ్యంలో రవికుమార్ యాదవ్...