శంషిగూడలో ప్రభుత్వ స్థలంపై కబ్జా ఆరోపణలు.. అధికారుల చర్యలపై స్థానికుల ప్రశ్నలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడ గ్రామం సర్వే నెం. 57లో ప్రభుత్వ భూమిపై కబ్జా జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానికుల కథనం ప్రకారం, సీఎంసీ సర్కిల్-51లో శానిటరీ విభాగంలో పనిచేస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తి, ఎన్టీఆర్ నగర్‌కు సంబంధించిన బాంబే స్కీమ్ కింద ఉన్న ప్రభుత్వ స్థలంలో సుమారు 100 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించి, అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా, తనకు రాజకీయ నాయకులు, అధికారులు అండగా ఉన్నారనే ధైర్యంతో వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు....