ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న నోవోటెల్, హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ–2026 6వ ఎడిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, నిపుణులు, సంస్థలను సత్కరించారు.తెలంగాణ ఆర్థికాభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్న వ్యక్తులు, సంస్థల ప్రతిభ, ఆవిష్కరణలు, నాయకత్వం...