ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:41 am Posted by : N Sandeep

ఎల్లమ్మబండ బస్తిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ? టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ బస్తిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ సర్కిల్-51 టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు ప్రోత్సాహం లభిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వేతనాలతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో విఫలమవుతున్నారని, అయితే వసూళ్ల విషయంలో మాత్రం అధికారులు ముందుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంపై కారణాలు ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని వ్యక్తమవుతోంది. క్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని, అయినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎల్లమ్మబండ బస్తిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. పై కథనంలోని ఆరోపణలు స్థానికులు చేస్తున్న ఆరోపణలుగా పేర్కొనబడ్డాయి. సంబంధిత అధికారుల స్పందన అందాల్సి ఉంది.